అర్హులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలి: జేసీ

KRNL: అందరికి ఇళ్ల పథకం కింద అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని జేసి నవ్య తెలిపారు. బుధవారం కల్లూరు మండలం బస్తిపాడు గ్రామంలో RDO సందీప్ కుమార్‌తో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఆమె, లే అవుట్‌ను త్వరలో పూర్తి చేసి ఇళ్ల మంజూరు చర్యలు చేపట్టాలని MRO ఆంజనేయులను ఆదేశించారు. జీవో నంబర్ 23 ప్రకారం ఇళ్ల స్థలాలను కేటాయించాలన్నారు.