నీలం జూట్ కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా

శ్రీకాకుళం: నీలం జూట్ యాజమాన్యంపై జిల్లా యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకొని అక్రమ లాకౌట్ ఎత్తి వేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి. తేజేశ్వర రావు, పట్టణ కన్వీనర్ ఆర్. ప్రకాశరావు సోమవారం డిమాండ్ చేశారు. నీలం జూట్ మిల్ అక్రమ లాకౌట్ వెంటనే ఎత్తివేయాలని, పరిశ్రమను వెంటనే తెరిపించి కార్మికులందరికీ ఉపాధి కల్పించాలని శ్రీకాకుళం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.