పూర్ఖానా మసీదు ఇస్లామిక్ సదస్సులో ఎమ్మెల్యే

పూర్ఖానా మసీదు ఇస్లామిక్ సదస్సులో ఎమ్మెల్యే

విశాఖ 35వ వార్డు పూర్ఖానా మసీదులో జరిగిన ఇస్లామిక్ సదస్సులో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... మతాలకతీతంగా అందరూ సోదరభావంతో ఉండాలన్నారు. నియోజకవర్గంలో మసీదుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ముస్లిం వ్యాపారులకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.