BRSపై ఆది శ్రీనివాస్ విమర్శలు
TG: BRSపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాలు గెలుస్తామని చెప్పి.. చిత్తుగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులే లేరని.. జూబ్లీహిల్స్‌లోనూ దెబ్బతిన్నారని.. అయినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రావడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.