వీధి కుక్కల దాడి.. ముగ్గురికి గాయాలు
NDL: గోస్పాడు(M) ఎం.చింతకుంట్లలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ మేరకు గ్రామంలోని ప్రతాప్ రెడ్డి కాలనీకి చెందిన ఇద్దరు చిన్నారులు, ఒక మహిళపై వీధి కుక్కలు దాడి చేశాయి. చికిత్స నిమిత్తం స్థానికులు వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. వీధి కుక్కల బెడద నుంచి మమ్మల్ని రక్షించండి అంటూ ప్రజలు అధికారులను కోరుతున్నారు.