'నేటి నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు'
NLG: నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో నేటి నుంచి డిగ్రీ వివిధ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు సీఓఈ డా. జి. ఉపేందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 2, 4, 8వ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు జరుగుతాయన్నారు.