నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
కాకినాడ రూరల్ ఇంద్రపాలెం సెక్షన్ 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో వార్షిక మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉదయ భాస్కర్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రేపురు, గంగానపల్లి, కొవ్వాడ, చీడిగ, ఇంద్రపాలెం గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.