హెల్మెట్లను అందజేసిన NH IT అధికారులు
SKLM: నరసన్నపేట మండలం మడపాం టోల్ ప్లాజా వద్ద NH-IT సదరన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై గణేష్, మోటార్ వెహికల్ అధికారి సంజీవరావు పాల్గొని వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.