VIDEO: తిరువెంగళపురంలో వైభవంగా 'బండి ఉత్సవం'
KDP: బద్వేల్ మండలం తిరువెంగలాపురంలో భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుక గ్రామ సంస్కృతికి, పూర్వీకుల ఆచారాలకు నిలుపుటద్దంగా నిలిచింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో నిర్వహించిన వేడుకలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ, గ్రామస్థులు శనివారం ఉత్సవం నిర్వహించారు.