ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్డీయే ఎంపీల సమావేశం

ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్డీయే ఎంపీల సమావేశం

ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీలంతా సమావేశమయ్యారు. వీరంతా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో భేటీ అయ్యారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. మరో వైపు ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన విషయం విధితమే.