గ్రామపంచాయతీలలో ఆడిట్ ప్రారంభం

గ్రామపంచాయతీలలో ఆడిట్ ప్రారంభం

MNCL: జన్నారం మండలంలోని గ్రామ పంచాయతీల్లో ఆడిట్ ప్రారంభమైంది. మండలంలోని 29 గ్రామ పంచాయతీల పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి, మౌలిక సౌకర్యాల పనులపై జిల్లా, రాష్ట్ర ఆడిట్ బృందం సభ్యులు మంగళవారం జన్నారంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆడిట్ నిర్వహిస్తున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు సమర్పించిన రికార్డుల ఆధారంగా ఆడిట్ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.