ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

NDL: బేతంచెర్ల-బనగానపల్లె రహదారిలోని KGBVలో బాలికల ప్రవేశం కోసం ఈ నెల 12 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని గురువారం ఎంఈవో సోమశేఖర్ తెలిపారు. ఐదో తరగతి పూర్తయిన బాలికలు ఆరో తరగతిలో ప్రవేశం కోసం ఏప్రిల్ ఒకటో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపిక జాబితాను ఏప్రిల్ 13న విడుదల చేస్తామన్నారు. బడి బయట ఉన్న బాలికలు, అనాథలు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.