'జాగ్రత్తలు పాటించకుంటే చర్యలు'
WGL: బాణసంచా విక్రయ దుకాణాలు ఏర్పాట్లు యజమానులు జాగ్రత్తలతో పాటు నిబంధనలు పాటించకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని మట్టెవాడ ఇన్స్‌పెక్టర్ కరుణాకర్ హెచ్చరించారు. మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటైన బాణసంచా విక్రయ కేంద్రాలను ఇన్స్‌పెక్టర్ సందర్శించి అనుమతి పత్రాలను పరిశీలించారు. భద్రత ఏర్పాట్లపై తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.