'అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

SDPT: అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించాలని సిద్దిపేట జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సారంగి సందన్న సూచించారు. 'ప్రజా పాలన' వారోత్సవాల్లో భాగంగా సిద్దిపేట పాఠశాలలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. మంటలను ఎలా అదుపు చేయాలి, అత్యవసర సమయంలో ఎలా స్పందించాలి అనే అంశాలను వివరించారు.