మూడో రోజు.. కవిత నిరవధిక నిరాహార దీక్ష

మూడో రోజు.. కవిత నిరవధిక నిరాహార దీక్ష

TG: ఖమ్మం వెలుగుమట్ల భూబాధితులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 3వ రోజుకు చేరింది. సోమవారం ఖమ్మంలో ఆందోళన చేపట్టిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి విడుదల చేశారు. ఆ రాత్రే బాధితులతో కలిసి దీక్ష ప్రారంభించగా, నిన్న పోలీసులు మళ్లీ అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం HYDలోని జాగృతి కార్యాలయంలో ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు.