అడ్డదారిలో పయనిస్తోన్న యువతరం
అన్నమయ్య: జిల్లాలో 18 నుంచి 27 ఏళ్ల వయసున్న యువత నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీలతో పాటు గంజాయి రవాణా, సైబర్ నేరాలు, హత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇందులో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారుండటం గమనార్హం. నేరాలపై ఉక్కుపాదం మోపుతామని, జిల్లాలోకి గంజాయి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు SP విశ్వనాథ్ తెలిపారు.