కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఏఎస్ఐ

కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఏఎస్ఐ

కృష్ణా: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుడివాడ ట్రాఫిక్ ఏఎస్ఐ భాగ్యవతి విశిష్ట సేవలకుగాను కలెక్టర్ బాలాజీ చేతుల మీదుగా ఆదివారం అవార్డును అందుకున్నారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియంత్రించడంలో భాగ్యవతి ప్రత్యేక గుర్తింపు పొందారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ, విశిష్ట సేవలు అందిస్తున్నారని తెలిపారు.