పర్యాటక కేంద్రంగా పాపన్నగౌడ్ కోట

పర్యాటక కేంద్రంగా పాపన్నగౌడ్ కోట

KNR: గోల్కొండ ఖిల్లాను పాలించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సైదాపూర్(M) సర్వాయిపేటలో నిర్మించిన కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రూ. 4.5 కోట్ల వ్యయంతో కోటను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. దళిత, బడుగు, మైనార్టీ వర్గాలు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన గొప్ప విప్లవకారుడు పాపన్న గౌడ్.