హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త రికార్డ్
భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ ప్రపంచ కప్‌లో అరుదైన ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా హర్మన్ నిలిచింది. నాలుగు నాకౌట్ మ్యాచ్‌లలో మొత్తం 331 పరుగులు చేసింది. ఈ రికార్డు ఇంతకుముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్(330 పరుగులు) పేరిట ఉండేది.