పథసంచలన్ కార్యక్రమంలో బండి సంజయ్
KNR: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కరీంనగర్‌లోని మండల 2, 3 పరిధిలో పథసంచలన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. సంచలన్ సమారోప్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.