రోడ్డుపై మురుగునీరు.. మా పరిస్థితి ఏంటి..!
GDWL: మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల తరచూ రోడ్లపైనే మురుగునీరు నిలిచిపోయి, గ్రామం అధ్వానంగా తయారైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై మురుగు నిలిచిపోవడంతో తాము విష జ్వరాల బారిన పడుతున్నామని గ్రామ ప్రజలు వాపోయారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య ఇలానే ఉన్నా, అధికారులు స్పందించడం లేదని పేర్కొన్నారు.