VIDEO: కారులో పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు

CTR: అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు సీజ్ చేసిన ఘటన పుంగనూరు(M) నేతిగుట్లపల్లి అటవీ ప్రాంతం వద్ద చోటు చేసుకుంది. CI సుబ్బరాయుడు వివరాల మేరకు.. ఓ కారు స్థానికులకు అనుమానాస్పదంగా రోడ్డుపై కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందులో ఎర్రచందనం దుంగలు లభ్యం అయ్యాయి. ఈ ఘటనలో కారుతోపాటు 19 దుంగలు, ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.