పర్యావరణ పరిరక్షణ కోసం 'వాటర్‌మ్యాన్' పోరాటం

పర్యావరణ పరిరక్షణ కోసం 'వాటర్‌మ్యాన్' పోరాటం

VSR :విశాఖపట్నం సహా కోస్తా తీర ప్రాంతంలో పెరుగుతున్న కాలుష్యంపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. వాటర్‌మ్యాన్ డాక్టర్ రాజేంద్ర సింగ్, బోలిశెట్టి సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ విచారణ జరుగుతుంది. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని వారు తెలిపారు. భూమి, నీరు, గాలిని కాలుష్యం నుంచి రక్షించుకోవాలని పిలుపునిచ్చారు.