అంగన్వాడీ ఉపాధ్యాయులకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ

అంగన్వాడీ ఉపాధ్యాయులకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ

BDK: చర్ల మండలంలోని కలివేరులో ఉన్న రైతు వేదికపై పోషణ్‌ అభియాన్‌లో భాగంగా శనివారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అంగన్వాడీ ఉపాధ్యాయులకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా భవిష్యత్ తరాలకు ఉపాధ్యాయులు ఆరోగ్య బాటలు వేస్తున్నారనారు. కేంద్రాల్లో అందించే పోషకాహారం ద్వారా ఆరోగ్య భారత్ సాధ్యమన్నారు.