ఆంజనేయ స్వామి వాహనంపై ఊరేగిన వెంకన్న

ఆంజనేయ స్వామి వాహనంపై ఊరేగిన వెంకన్న

AKP: నక్కపల్లి మండలం ఉపమాక కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు బుధవారం శ్రీదేవి, భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామిని ఆంజనేయస్వామి వాహనంపై ఊరేగించారు. మంగళ వాయిద్యాలతో మాడవీధుల్లో తిరువీధి సేవ నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదం అందించారు.