చెరువు నిర్మాణ పనుల పరిశీలన
ATP: నార్పల మండలం గుంజేపల్లి గ్రామంలో జరుగుతున్న చెరువు నిర్మాణ పనులను మంగళవారం స్పెషల్ ఆఫీసర్ నారపరెడ్డి పరిశీలించారు. గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెరువు నిర్మాణ పనులు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. చెరువు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.