VIDEO: ఇకపై అలాంటి చెత్త సేకరించబడదు: కలెక్టర్
ప్రకాశం: ఇక నుంచి తడి చెత్త, పొడి చెత్త కలిపి వేసే వారి చెత్తను సేకరించబడదని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. శనివారం ఒంగోలు పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ వల్ల కలుగు అనర్ధాలు వివరించి పర్యావరణానికి మేలు చేసేందుకు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు.