జీఎస్టీ సవరణలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: ఎంపీడీవో
GNTR: తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందితో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో అత్తోట దీప్తి, ఎంఈవో లక్ష్మీనారాయణ, ఐసీడీఎస్ సీడీపీవో విజయ గౌరీ పాల్గొని పలు సూచనలు చేశారు. జీఎస్టీ సవరణల ద్వారా 800 దాకా ప్రొడక్ట్స్‌పై ధరలు తగ్గుతాయని చెప్పారు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగమని, ఈ విషయాన్ని ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.