బిల్లుల కోసం కాంట్రాక్టర్ నిరాహార దీక్ష

BHNG: భువనగిరి మండలం హనుమాపురం చెందిన కాంట్రాక్టర్ నాగపురి కృష్ణ మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.50 లక్షల బిల్లుల కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవడంతో అప్పులపాలయ్యానని, వడ్డీలు చెల్లించలేక, కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నాని ఆవేదన వ్యక్తం చేశారు.