'వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదు'

'వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదు'

GNTR: రాజధాని కోసం అమరావతి రైతులు 30 వేల ఎకరాలు ఇచ్చారని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఈ మేరకు వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని మండిపడ్డారు. అలాగే, గత వైసీపీ ప్రభుత్వంలో భూములిచ్చిన రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే అని హామీ ఇచ్చారు. చట్టం చేశాక దాన్ని అందరూ అనుసరించాల్సిందే అని ఉద్ఘాటించారు.