'కోవర్టుల వల్లే మేం ఓడిపోయాం'
MDK: మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలోనే బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారని ఆరోపించారు. వారి కారణంగానే పంచాయితీ ఎన్నికల్లో పార్టీకి ఓటమి ఎదురైందన్నారు. ఈ కోవర్టు వ్యవస్థ లేకపోతే సర్పంచ్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌నే గెలిచేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం స్థానికంగా వైరల్ అవుతున్నాయి.