ఎనుముపల్లి గ్రామంలో వైసీపీ నాయకుడి మృతి

సత్యసాయి: పుట్టపర్తి మున్సిపాలిటీ ఎనుముపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బీరే నారాయణ (55) అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి నారాయణ పార్థివదేహానికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, YSRCP నాయకులు పాల్గొన్నారు.