IPLలో కెప్టెన్లకు తీవ్ర ఒత్తిడి: కేఎల్ రాహుల్

IPLలో కెప్టెన్లకు తీవ్ర ఒత్తిడి: కేఎల్ రాహుల్

స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. IPLలో కెప్టెన్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని తెలిపాడు. వారు క్రీడేతర నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులకు జవాబుదారీగా ఉంటారని చెప్పాడు. నిర్ణయాల విషయంలో కెప్టెన్లకు నిరంతరం ఫ్రాంచైజీ యాజమాన్యాలు ప్రశ్నలు వేస్తుంటాయని వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడటం కంటే IPL సీజన్ ముంగిపునాటికి ఎక్కువ అలసిపోయానని పేర్కొన్నాడు.