మహాధర్న కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జర్నలిస్టులు
NRML: హైదరాబాద్‌లోని సమాచార శాఖ కార్యాలయంలో బుధవారం టీయూడబ్ల్యూజే(ఐజేయు) ఆధ్వర్యంలో తలపెట్టిన మహాధర్నా కార్యక్రమంలో జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని, అక్రిడేషన్లను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూమయ్య, ప్రమోద్, తదితరులు పాల్గొన్నారు.