'కనిగిరి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులుగా కలాం'
ప్రకాశం: కనిగిరి కాంగ్రెస్ పార్టీ పట్టణ మైనార్టీ అధ్యక్షులుగా ఎస్కే అబ్దుల్ కలాం నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహబూబ్ వలి నియామక పత్రాన్ని సోమవారం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. నాపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీకి, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని నూతన అధ్యక్షులు తెలిపారు.