గౌరవరం టోల్‌ప్లాజా వద్ద గంజాయి పట్టివేత

గౌరవరం టోల్‌ప్లాజా వద్ద గంజాయి పట్టివేత

KMM: పెనుబల్లి మండలం గౌరవరం టోల్‌ప్లాజా వద్ద మంగళవారం ఎక్సైజ్ అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో తనిఖీలు చేపట్టగా, ఓ యువకుడి వద్ద 4 కిలోల గంజాయి లభ్యమైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న సత్తుపల్లి ఎక్సైజ్ పోలీసులు, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.