'వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవు'

'వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవు'

KDP: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 24 నుంచి జూన్ 12వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని మండల విద్యాశాఖ అధికారి నాగ స్వర్ణ లత బుధవారం తెలిపారు. ప్రత్యేక తరగతుల పేరుతో తరగతులు నిర్వహించిన, అడ్మిషన్లు ప్రారంభించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.