'లోకేష్ చిన్నపిల్లోడు' : మంత్రి కోమటిరెడ్డి

NLG: బనకచర్ల ప్రాజెక్ట్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఎలాగైనా బనకచర్ల నిర్మాణాన్ని అడ్డుకోవాలన్నారు. అవసరమైతే కేంద్రంతో కూడా కొట్లాడతామని పేర్కొన్నారు. AP మంత్రి 'లోకేష్ చిన్నపిల్లోడు, ఆయన వ్యాఖ్యలపై నేను మాట్లాడను' అని స్పష్టం చేశారు. ప్రాంతీయ బేధాలు రెచ్చగొడుతున్నారని లోకేష్ అన్న విషయం తెలిసిందే.