VIDEO: 'వడ్డేపాలెంలో నీటి సమస్యను పరిష్కరిస్తాం'

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని వడ్డెపాలెంలో మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు కొత్తూరు నుంచి వచ్చే నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆరు నెలలుగా ఇబ్బందులు పడుతున్నామని మున్సిపల్ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. త్వరలోనే నూతన బోరు ఏర్పాటు చేసి నీటి సరఫరా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.