కోమటికుంట్లలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం

ATP: పుట్లూరు మండలంలోని కోమటికుంట్ల గ్రామంలో బుధవారం జిల్లా వనరుల కేంద్రం అధికారి లక్ష్మీ నరసింహ పర్యటించారు. మండల వ్యవసాయ అధికారి కాత్యాయనితో కలిసి 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖరీఫ్ పంటల సాగు, సస్యరక్షణ చర్యలపై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో చిన్ననాగిరెడ్డి పాల్గొన్నారు.