VIDEO: రైల్వే స్టేషన్ పనులు ముమ్మరంగా ముందుకు

VIDEO: రైల్వే స్టేషన్ పనులు ముమ్మరంగా ముందుకు

MBNR: హన్వాడ మండలం మన్యంకొండ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా శుక్రవారం ప్లాట్‌ఫాంపై రేకుల షెడ్లు, అలాగే డ్రైనేజీల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. వర్షం నీరు నిల్వ ఉండకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.