ఉధృతంగా ప్రవహిస్తున్న బుగ్గ వాగు

MHBD: డోర్నకల్ మండల కేంద్రంలో గురువారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల బుగ్గవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనితో డోర్నకల్-లింగాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక గ్రామాలకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ప్రయాణం కష్టంగా మారింది.