గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ విజయనగరం నుంచి రాకపోకలు

VZM: కోమటిపల్లి స్టేషన్‌లో అభివృద్ధి పనుల దృష్ట్యా డిసెంబర్ 4వ తేదీ వరకు గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ రైలు విజయనగరం జంక్షన్ నుంచి రాకపోకలు సాగిస్తుందని వాల్తేర్ డీసీఎం సందీప్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేసారు. ట్రైన్ నంబర్ 17243 /44 గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ ద్వారా రాకపోకలు సాగించే ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని కోరారు.