జిల్లాలో సుపరిపాలన వారోత్సవాలు ప్రారంభం: కలెక్టర్
KRNL: ఈ నెల 25 వరకు జిల్లాలో సుపరిపాలన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఇవాళ కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. 'గ్రామాల వైపు పరిపాలన' కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్తో పాటు అన్ని రెవెన్యూ డివిజన్, మండల కార్యాలయాల్లో ప్రజల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, తమ సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు.