'ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించాం'

'ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించాం'

PLD: కూటమి ప్రభుత్వ సహకారంతో యడ్లపాడు మండలం గణపవరం గ్రామంలో తాగునీటి సమస్యను సుమారు రూ.34 లక్షల వ్యయంతో పరిష్కరించామని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం స్థానిక కూటమి నాయకులతో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన తాగునీటి ఫిల్టర్ బెడ్‌లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.