రెండు టెంపోలు దగ్ధం

NLR: బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని లైలా సమీపంలో రెండు టెంపోలు దగ్ధమయ్యాయి. బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ వల్లే టెంపోలు కాలిపోయాయని యాజమాని వేణు, మస్తాన్ వాపోయారు. దీంతో తాము జీవనోపాధి కోల్పోయామన్నారు. సుమారు 20 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.