ముంపు గ్రామాలకు పశువుల మేత తరలింపు

ముంపు గ్రామాలకు పశువుల మేత తరలింపు

W.G: గోదావరి వరదల కారణంగా కుక్కునూరు మండలంలోని గొమ్ముగూడెం, లచ్చిగూడెం, వేలేరుపాడు మండలంలోని రేపకగొమ్ము, రుద్రమకోట, కోయిదా గ్రామాల్లో పశువులకు మేత కొరత తీవ్రంగా ఉంది. ఈ సమయంలో రైతుల ఆవేదనను గమనించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఆదేశాల మేరకు జంపన కృష్ణంరాజు పశువుల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేశారు. ఈ క్రమంలో గురువారం రెండు లారీల ఎండు గడ్డిని పంపించారు