శ్రీకృష్ణ విద్యా మందిర్‌లో సంక్రాంతి సంబరాలు
విశాఖలోని ద్వారకానగర్‌లోని శ్రీకృష్ణ విద్యా మందిర్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు చిన్నారులను అలరించాయి. పల్లె సంస్కృతిని ప్రతిబింబించే గొబ్బెమ్మలు, కోలాటం, గాలిపటాలు, బొమ్మల కొలువు, పిండివంటల ప్రదర్శనలతో పాఠశాల ప్రాంగణం కళకళలాడింది. భోగిపళ్ల కార్యక్రమం ద్వారా భారతీయ సంప్రదాయాలను విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు.