లివిరి మార్గంలో.. ప్రయాణం నరకం

లివిరి మార్గంలో.. ప్రయాణం నరకం

PPM: భామిని మండలంలోని లివిరి వెళ్లే రోడ్డు ఇటీవల వర్షాలతో కోతకు గురైంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నెల రోజులు అవుతున్నా బాగు చేయకపోవడంతో రాత్రి వేళల్లో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిపై ఐటీడీఏ ఏఈ సింధూజ వద్ద ప్రస్తావించగా.. ఇప్పటికే పరిశీలించా మని, ప్రతిపాదనలు పంపించి మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.