విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: సీపీ
SDPT: ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తప్పవని సీపీ విజయ్‌కుమార్ హెచ్చరించారు. విజయోత్సవాల సందర్భంగా పటాకులు కాల్చడం, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే మొదటి దశ ఎన్నికల్లో 20 కేసులు, రెండో దశలో 13 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.